యువతిని చిత్రహింసలు పెట్టిన గ్రామ పెద్దలు | Village elder beat up girl with sticks for eloping | Sakshi
Sakshi News home page

యువతిని చిత్రహింసలు పెట్టిన గ్రామ పెద్దలు

Aug 17 2019 11:23 AM | Updated on Aug 17 2019 11:38 AM

ప్రేమించిన యువకుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయినందుకు గాను ఓ యువతి పట్ల గ్రామపెద్దలు అమానుషంగా ప్రవర్తించారు. పంచాయతీ పెట్టి.. కర్రలతో ఆ యువతిని కొడ్తూ, కిందపడేసి తంతూ చిత్ర హింసలకు గురి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అనంతపురం జిల్లాలో గురువారం చోటుచేసుకున్న ఈ సంఘటన శుక్రవారం వెలుగుచూసింది. గుమ్మఘట్ట మండలం కేపీదొడ్డి గ్రామానికి చెందిన ఇద్దరు ప్రేమికులు పది రోజుల క్రితం గ్రామం వదిలి వెళ్లిపోయారు. ఇరువురి తల్లిదండ్రులు వారిని ఊరికి రప్పించి పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement