ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రతిపాదనలు లేవని రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రవాణా శాఖ ఆదాయంలో దేశంలోనే నాల్గో స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఈ మధ్య ఆర్టీఏలో కార్డ్స్ అందుబాటులో లేకపోవడంతో సమస్యలు వస్తున్నాయని తెలిపారు.