ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఆత్మహత్య చేసుకున్న శ్రీనివాస్‌రెడ్డి మృతదేహాం కొద్దిసేపటి క్రితం ఖమ్మంకు చేరుకుంది. శనివారం రోజున ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన శ్రీనివాస్‌రెడ్డి.. హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో ఆపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందారు. దీంతో ఆయన మృతదేహానికి అదే ఆస్పత్రిలో వైద్యులు పోస్టుమార్టమ్ నిర్వహించారు. అనంతరం భారీ భద్రత నడుమ శ్రీనివాస్‌రెడ్డి మృతదేహాన్ని ఖమ్మంకు తరలించారు.