ఈనాటి ముఖ్యాంశాలు | Today Telugu News Roundup Sep 13th Satya Nadellas father Yugandhar passes away | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Sep 13 2019 8:28 PM | Updated on Mar 21 2024 8:31 PM

గణేశ్‌ నిమజ్జనోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఖట్లాపూరా ఘాట్ వద్ద నిమజ్జనానికి వెళ్తుండగా నదిలో పడవ బోల్తాపడి 11 మంది మృతిచెందారు. మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారి యుగంధర్ కన్నుమూశారు. యుగంధర్ కుమారుడు సత్యనాదేళ్ల ప్రస్తుతం మైక్రోపాఫ్ట్ సీఈఓగా పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్‌ రాజీవ్ కుమార్ శుక్రవారం సమావేశమయ్యారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికతో నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ వద్ద అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. రాష్టంలో ఎక్కడా డెంగ్యూ జ్వరాలు లేవని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement