పట్టణ మౌలిక వసతుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు గుర్తింపుగా లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కడం సంతోషకరమని రాష్ట్ర మంత్రి రామారావు అన్నారు. మంత్రిగా రాష్ట్రాభివృద్ధికి చేస్తున్న కృషికి, పాలనాపరంగా రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణకు తీసుకుంటున్న చొరవకుæ గుర్తింపుగా బిజినెస్ వరల్డ్ సంస్థ ప్రకటించిన అర్బన్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును మంత్రి కేటీఆర్ అందుకున్నారు. బిజినెస్ వరల్డ్ సంస్థ అవార్డుల ప్రదానోత్సవం బుధవారం ఢిల్లీలోని ఓ ప్రైవేటు హోటల్లో జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి హర్దీప్ సింగ్.. కేటీఆర్కు అవార్డును అందజేశారు. అలాగే ఉత్తమ పట్టణ మౌలిక వసతుల రాష్ట్రంగా తెలంగాణకు మరో అవార్డు వచ్చింది.
లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న మంత్రి
Dec 21 2017 10:25 AM | Updated on Mar 20 2024 5:24 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement