మరో దశ ప్రచారానికి వ్యూహాలు | Telangana election dates announced | Sakshi
Sakshi News home page

మరో దశ ప్రచారానికి వ్యూహాలు

Oct 8 2018 6:55 AM | Updated on Mar 20 2024 3:43 PM

ముందస్తు ఎన్నికల షెడ్యూల్‌పై అంచనాలు తప్పడంతో టీఆర్‌ఎస్‌ కాస్త ఆందోళన చెందినా.. ఈ పెరిగిన గడువును సమర్థవంతంగా వినియోగించుకోవాలని భావిస్తోంది. కేసీఆర్‌ ఊహించినదానికంటే నెలరోజులు ఆలస్యంగా ఎన్నికలు జరుగుతుండటంతో.. అదనపు సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్లనుంది. ఇందులో భాగంగానే.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఎన్నికల ప్రచార సరళిపై సీఎం కేసీఆర్‌ ఆదివారం సమీక్ష నిర్వహించారు. అభ్యర్థుల ప్రచార తీరుపై వివరాలను టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కమిటీ బాధ్యులను అడిగి తెలుసుకున్నారు. వీరిచ్చిన సమాచారం ఆధారంగానే పలువురు అభ్యర్థులకు ఫోన్‌లో సూచనలు చేశారు. ఈ రెండు నెలల కాలాన్ని ఎక్కడా ప్రణాళికాలోపం లేకుండా సక్రమంగా వినియోగించుకోవాలని.. మరోదశ ప్రచారం చేసుకునేందుకు వీలుగా షెడ్యూల్‌ రూపొందించుకోవాలని ఆయన ఆదేశించారు. గ్రామస్థాయిలో పార్టీ వ్యవస్థను బలోపేతం చేసుకోవడంతోపాటు.. ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలిసేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. త్వరలోనే వరంగల్, ఖమ్మం,  ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో బహిరంగసభలు నిర్వహిస్తామన్నారు. అన్నీ పరిశీలించి తేదీలు ఖరారు చేస్తామని అభ్యర్థులకు సీఎం తెలిపారు. అక్టోబరు 9 తర్వాత పెండింగ్‌ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తామని.. ఈ నియోజకవర్గాల్లోనూ ప్రచారాన్ని పెంచాలని ఆయా సెగ్మెంట్లలోని ఆశావాహులకు సూచించారు. 
 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement