పోలవరం అసెంబ్లీ సీటు పంచాయతీపై సీఎం చంద్రబాబు నాయుడు నివాసం వద్ద తెలుగు తమ్ముళ్లు రచ్చరచ్చ చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ముడియం శ్రీనివాస రావుకు పోలవరం అసెంబ్లీ టికెట్ ఇవ్వద్దని ఆయన వ్యతిరేక వర్గం నినాదాలు చేయగా, ఆయకే సీటు కేటాయించాలని అనుకూల వర్గం డిమాండ్ చేస్తోంది. రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగి కొట్లాటకు దారీతీసింది. పోలీసులు రంగ ప్రవేశం చేసినా వారిని అదుపుచేయలేక పోయారు. పార్టీలోని రెండు వర్గాల నేతల అరుపులు కేకలతో సీఎం నివాస ప్రాంతం దగ్గరిల్లింది.