‘నీతి, నిజాయితీకి మారు పేరు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఇప్పుడేం చెప‍్తారు? ఇంత జరిగినా ఎందుకు నోరు మెదపడం లేదు? బాబు బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి’ అని గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ సూటిగా ప్రశ్నలు సంధించారు. ఐటీ అధికారులు నిర్వహించిన సోదాల్లో చంద్రబాబు, ఆయన సన్నిహితుల అవినీతి బండారం బట్టబయలు అయిన సంగతి తెలిసిందే.