ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మనేర్ హాస్టల్ బాత్రూమ్‌లో పీజీ విద్యార్థి మురళీ ఉరేసుకుని బలవన్మరణం చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఓయూ హాస్టల్‌కు చేరుకుని పరిశీలిస్తున్నారు. విద్యార్థి మురళీ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించే యత్నం చేయగా పోలీసులను విద్యార్థులు అడ్డుకున్నారని సమాచారం.