పాదయాత్ర చేయకుండా తనను ఎందుకు అడ్డుకుంటున్నారో ఏపీ సీఎం చంద్రబాబు అధికారికంగా చెప్పి తీరాలని కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రం చంద్రబాబు ఎస్టేట్ కాదని, ఆయన ట్రస్టీ మాత్రమేనని పేర్కొన్నారు. కేసులతో బెదిరింపులకు దిగడం కాదు.. దమ్ము, ధైర్యం ఉంటే కార్యాచరణకు దిగాలని సవాల్ చేశారు.