టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకరే అనుకుంటే అతని గన్‌మెన్‌లు కూడా ఏమాత్రం తీసి పోవడం లేదు. ఏలూరులో పోస్ట్‌ల బ్యాలెట్ వద్ద చింతమనేని ప్రభాకర్ మాజీ గన్‌మాన్ లక్ష్మణ్ హల్‌చల్ చేస్తూ.. ఉద్యోగులను బెదిరించే ప్రయత్నం చేశాడు. సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఉంచారు. ఈ క్రమంలో లక్ష్మణ్ శుక్రవారం ఉదయం నుంచి యూనిఫామ్‌లోనే కాలేజీ ప్రాంగణం అంతా తిరుగుతూ.. చింతమనేని ప్రభాకర్‌కు ఓటేయ్యాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దాంతో లక్ష్మణ్‌పై ఈసీ చర్యలు తీసుకోవాలంటూ అధికారులు డిమాండ్ చేస్తున్నారు.