తెలంగాణ టీడీపీ సంక్షోభం ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...అసలు టీడీపీలో ఎంతమంది ఎమ్మెల్యేలున్నారని ప్రశ్నించారు. తెలంగాణ టీడీపీలో ఉన్నదే ముగ్గురు ఎమ్మెల్యేలని, వారిలో ఒకాయన మీడియా హైప్ కోసం తాపత్రయపడతారని.. ఇంకొకాయన పైరవీలు చేస్తారని.. మరొకరు కండువానే కప్పుకోరని ఏద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ అనే మహా సముద్రంలో రేవంత్ ఎంతన్నారు. ఎవరిని ఎలా వాడుకోవాలో కాంగ్రెస్‌కు బాగా తెలుసన్నారు.