ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ లోక్‌సభ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న మేనకా గాంధీ సోమవారం పిలిభిత్ జిల్లా వాసులతో మాట్లాడుతూ తనకు వచ్చిన ఓట్ల ప్రాతిపదికన ఆయా ప్రాంతాలను ఏబీసీడీలుగా విభజించి అభివద్ధి కార్యక్రమాలను అమలు చేస్తానని హెచ్చరించిన విషయం తెల్సిందే. అంటే, ఎక్కువ ఓట్లు వచ్చిన ప్రాంతాలను ‘ఏ’ కేటగిరీగా తక్కువ ఓట్లు వచ్చిన ప్రాంతాలను ‘డీ’ కేటగిరీలుగా విభజిస్తానని చెప్పడం.