పని ప్రదేశాల్లోమహిళలు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను మీటూ పేరుతో బాహాటంగా వెల్లడిస్తున్న క్రమంలో కేంద్రం స్పందించింది. ఈ తరహా లైంగిక దాడులు, వేధింపుల కేసులన్నింటిపైనా బహిరంగ విచారణకు పదవీవిరమణ చేసిన నలుగురు న్యాయమూర్తులతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమిస్తుందని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రి మేనకా గాంధీ పేర్కొన్నారు.