గుర్రపు బండి పోటీల్లో అపశ్రుతి | Man dies during horse cart racing in Karnataka | Sakshi
Sakshi News home page

గుర్రపు బండి పోటీల్లో అపశ్రుతి

Sep 5 2018 3:21 PM | Updated on Mar 22 2024 11:07 AM

కర్నాటకలోని హుబ్లీలో దారుణం చోటుచేసుకుంది. గుర్రపు బండి పోటీల్లో అపశృతి చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న గుర్రపు బండి పైనుంచి ప్రమాదవశాత్తూ ఓ యువకుడు కిందపడి మృతిచెందాడు. హుబ్లీలోని భూదానగడ్డ బసవేశ్వర ఆలయం ఆధ్వర్యంలో బుధవారం గుర్రపు బండ్ల రేసు నిర్వహించారు.

అయితే ఈ రేసులో పాల్గొన్న ఓ యువకుడు గుర్రపు బండి నుంచి కిందపడి వెనకాలే వస్తున్న మరో గుర్రపు బండి కిందపడి మృతిచెందాడు. ఈ గుర్రపు బండ్ల రేసుకి నిర్వాహకులు పోలీసుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని తెలుస్తోంది. రోడ్డు పక్క నుంచి తిలకిస్తున్న యువకులు తీసిన వీడియోలో ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. ప్రమాద దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement