ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీ ఏదో తెలుసా.. తెలియకపోతే తెలుసుకోండి. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత విలువైన కరెన్సీ కువైట్ దీనార్. ఒక కువైట్ దీనార్ భారత కరెన్సీలో సుమారు రూ. 215లకు సమానం. కానీ ఒకప్పడు కువైట్ ఏ కరెన్సీ ఉపయోగించేదో తెలుసా.. ఇండియా కరెన్సీనే వాడేది. 1959 వరకూ భారతీయ రూపాయినే కువైట్ కరెన్సీగా చలామణి అయ్యేది. కానీ 1960లొ తొలిసారి రూపాయి స్థానంలో గల్ఫ్ రూపీని ప్రవేశ పెట్టింది. తరువాత కాలక్రమేణా ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీగా రూపాంతం చెందింది.