'మాయమై పోతున్నడమ్మ మనిషన్న వాడు.. మచ్చుకైనను లేదు చూడు మానవత్వం ఉన్నవాడు' అన్నట్లు నిజంగానే సమాజంలో మానవత్వం మాయమైన సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. తమ కళ్లముందే రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని కాపాడాల్సింది పోయి.. ఫోటోలు, వీడియోలు తీస్తూ కాలక్షేపం చేశారు. చుట్టూ ఎంతమంది ఉన్నా సకాలంలో స్పందించేవారు కరువయ్యారు. దీంతో ఓ అధికారి నిండు ప్రాణాలు కోల్పోయారు. మానవత్వం మంటగలిసిన ఈ సంఘటన ఖమ్మం జిల్లా వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం ఉదయం చోటు చేసుకోగా.. చనిపోయింది ఏఎస్‌ఐ భాస్కర్ గా తేలింది..