తమిళనాడులోని ప్రసిద్ధ ఎస్‌పీకే అండ్‌కో యజమానుల ఇళ్లు, కార్యాలయాలపై సోమవారం ఐటీ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. రూ.160 కోట్ల నగదు, 100 కేజీల బంగారు, రూ.వేలకోట్ల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. సదరు సంస్థ యజమాని సెయ్యాదురై సుమారు 30 ఏళ్ల క్రితం రామనాథపురం మేల్‌ముడిమన్నర్‌కోట పరిసర ప్రాంతాల్లో పశువులు మేపుకునే వృత్తిపై ఆధారపడి జీవించేవాడు. ఆ సమయంలోనే అధికార పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులతో స్నేహం ఏర్పడింది. సదరు మంత్రుల సిఫార్సుతో జాతీయ రహదారుల్లో చిన్నపాటి కాంట్రాక్టులు పొందడంతో ప్రారంభించి క్రమేణా కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టులు చేసే స్థాయికి ఎదిగాడు. తమిళనాడు జాతీయరహదారుల శాఖ కింద కొత్తగా రహదారులు నిర్మించడం, పాత వాటికి మరమ్మతులు చేయడం వంటి కాంట్రాక్టులను అనేక సంస్థలు పొందుతున్నా ఎస్‌పీకే అండ్‌కో అగ్రశ్రేణి సంస్థగా పేరుపొందింది.
ఐటీ అధికారులకే షాక్ ఇచ్చిన ఘటన
Jul 17 2018 9:44 AM | Updated on Mar 20 2024 3:38 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement