గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం | Guntur: Road Accident Took Place At Savalyapuram | Sakshi
Sakshi News home page

గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం

Sep 9 2020 4:24 PM | Updated on Mar 21 2024 7:59 PM

సాక్షి, గుంటూరు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు కార్లు ఢీ కొన్న ఘటనలో ఇద్దురు మృతి చెందగా.. ఐదుగురికి గాయాలయ్యాయి. గుంటూరు లోని శావల్యాపురం మండలంలో బుధవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కనమర్లపూడి వద్ద రెండు కార్లు ఒకదానికి ఒకటి ఢీ కొట్టాయి. నంద్యాల నుంచి విజయవాడ వెళ్తున్న కారు, ఏలూరు నుంచి వినుకొండ వైపు వస్తున్న మరో కారు ఎదురేదురుగా వేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏలూరుకి చెందిన ఉదయ్, నంద్యాలకు చెందిన వెంకటసుబ్బయ్య అనే వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.‌ మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వినుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement