జిల్లాలోని గంగవరం మండలంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పి బోల్తా పడిన కారులో మంటలు వ్యాపించటంతో ఐదుగురు సజీవ దహనమయ్యారు. ఈ సంఘటన మామడుగు సమీపంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరుపతి గోర్లకుంటకు చెందిన ఆరుగురు ఏపీ 03 బీఎన్ 7993 నెంబర్ కారులో బెంగళూరు నుంచి పలమనేరుకు బయలు దేరారు. కారు మామడుగు సమీపంలోకి రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి.