శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో తృటిలో తప్పిన ప్రమాదం | Flight catches fire while landing at Shamshabad Airport | Sakshi
Sakshi News home page

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో తృటిలో తప్పిన ప్రమాదం

Aug 2 2018 9:42 AM | Updated on Mar 21 2024 9:00 PM

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో గురువారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. తెల్లవారుజామున కువైట్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన జజీరా ఎయిర్‌లైన్స్‌ విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన పైలట్‌ విమానాన్ని వెంటనే నిలిపేశారు.

విమానం రన్‌ వేపై దిగుతున్న సందర్భంలో కుడి వైపున ఉన్న ఇంజన్‌ నుంచి మంటలు వచ్చాయి. విమానం నిలిపిన తర్వాత హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను ఆర్పేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సివుంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement