తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందనే కారణంతో.. పోలీసు కస్టడీలో ఉన్న ఇంటి ఆడపడచును కిడ్నాప్ చేసిందో కుటుంబం. ఈ క్రమంలో తమకు అడ్డుపడిన పోలీసులను సైతం కొట్టి ఆమెను అపరించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో చోటుచేసుకుంది. వివరాలు... ముజఫర్‌నగర్‌కు చెందిన ఓ ముస్లిం యువతి.. ఇంట్లో నుంచి పారిపోయి... ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ విషయం పెద్దలకు తెలియడంతో చంపుతామని బెదిరించారు. ఈ క్రమంలో నవజంట పోలీసులను ఆశ్రయించింది. అయితే తమ అమ్మాయి మైనరు అని, ఈ పెళ్లి చెల్లదంటూ ఆమె కుటుంబ సభ్యులు వాదించారు. దీంతో అమ్మాయికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఆస్పత్రికి తరలించాలని కోర్టు ముజఫర్ నగర్ పోలీసులను ఆదేశించింది.ఈ నేపథ్యంలో పోలీసు కారులో ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించే క్రమంలో.. అడ్డగించిన కుటుంబ సభ్యులు కారు నుంచి ఆమెను లాక్కువెళ్లారు. ఆ సమయంలో అడ్డువచ్చిన పోలీసులను, స్థానికులపై కూడా దాడి చేశారు. కాగా సమీపంలో ఉన్న ఓ అడవిలో యువతి జాడ తెలియడంతో పోలీసులు ఆమెను మళ్లీ అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులపై దాడి చేసి మరీ.. కూతురి కిడ్నాప్!
Sep 5 2018 5:19 PM | Updated on Mar 22 2024 11:07 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement