తమ్ముడి ముందే డాడీ కాల్చుకున్నాడు.. | Face To Face With RTC Driver Srinivas Reddy Family | Sakshi
Sakshi News home page

తమ్ముడి ముందే డాడీ కాల్చుకున్నాడు..

Oct 14 2019 1:46 PM | Updated on Mar 21 2024 11:35 AM

‘ఆయనను కళ్లలో పెట్టుకుని చూసుకున్నాను. మార్నింగ్‌ టిఫిన్‌ చేసి బయటికి వెళ్లారు. అంతే ఆ తర్వాత అసలేం జరిగిందో తెలియదు. ఆయన నాకు మళ్లీ కావాలి. మాలాంటి పరిస్థితి పగవాళ్లకు కూడా రాకూడదు’ అంటూ ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి భార్య విలపిస్తున్న తీరు ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టిస్తోంది. ఏనాడు ఇంట్లో నుంచి బయటికి రానిదాన్ని ఈరోజు ఇలా మాట్లాడాల్సి వస్తుంది అంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తమ కుటుంబంతో పాటు 48 వేల ఆర్టీసీ కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కన్నీళ్లతో విఙ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆర్టీసి కార్మికులు గత తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement