'సంక్షోభం సృష్టించండి, విభజనను అడ్డుకోండి' | Create constitutional crisis to prevent state bifurcation says YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

Oct 3 2013 9:08 PM | Updated on Mar 21 2024 7:47 PM

తెలంగాణ రాష్ర ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలుపుతూ తీసుకున్న నిర్ణయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ కుమ్మక్కవ్వడమే రాష్ట్ర విభజనకు దారి తీసిందన్నారు. చాలా బాధకరమైన సంఘటన అని..గత 16 నెలల జైలు జీవితంలో కూడా తాను ఇంతటి బాధను అనుభవించలేదు అని అన్నారు. ఓట్ల కోసం, సీట్ల కోసం చరిత్ర హీనంగా రాష్ట్రాన్ని విభజిస్తున్నారు అని అన్నారు. రాష్ట్ర హీనంగా విభజిస్తున్న పరిస్థితి చూస్తే...వీళ్లు మనుషులేనా అనిపిస్తోంది అని ఆవేదన వ్యక్తం చేశారు. తీర్మానం ఆధారంగానే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని, రెండు రాష్ట్రాలు కలయిక సందర్భంలో కూడా తీర్మానం చేసిన సంగతి తెలిసిందేనని వైస్ జగన్ తెలిపారు. డిసెంబర్ 9 ప్రకటన సందర్భంగా అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాతే రాష్ట్ర విభజన ప్రకటన ప్రారంభమవుతుందని అప్పటి హోంమంత్రి చిదంబరం చెప్పిన విషయాన్ని వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. మధ్య ప్రదేశ్, బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలను విభజించిన నేపథ్యంలో అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాతే మూడు రాష్రాలను ఏర్పాటు జరిగిందన్నారు. ఈ రోజు మన రాష్ట్రంలో అసెంబ్లీలో తీర్మానం చేయాలనే పద్దతిని పక్కన పెట్టారు అని జగన్ అన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై రాష్ట్ర విభజనకు సహకారం అందించాయన్నారు. గవర్నర్ ను కలిసిన సమయంలో కూడా అసెంబ్లీ సమావేశ పర్చాలని విజ్ఞప్తి చేశామన్నారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి కూడా లేఖలు రాశామనే విషయాన్ని మీడియాకు తెలిపారు. అసెంబ్లీని సమావేశం పెట్టండి, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేసి పంపిద్దాం.. కేంద్రంపై ఒత్తిడి పెరుగుతోంది అని సూచించామన్నారు. అన్ని పార్టీల వైపు నుంచి మూడు పార్టీల వైపుకు రండి, విభజన వ్యతిరేకంగా లేఖలు ఇవ్వండి..అనుకూలంగా రాసిన లేఖలు వెనక్కి తీసుకోండి అని అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశృ఼రు. ఓట్ల కోసం సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించిన.. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు చరిత్ర హీనులు చరిత్ర పుటల మిగిలుతారు అని వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ 72 గంటల బంద్ కు పిలుపునిస్తున్నాం అని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. తమ రాజీనామాలను ఆమోదించాలని లేఖలు రాశాం అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేస్తే.. యూపీఏ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం.. రాజ్యాంగ సంక్షోభం ఏర్పడటం ద్వారా.. రాష్ట్ర విభజన ప్రక్రియను ఆగిపోతుందని వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన పై కోర్టులో పిటిషన్లను దాఖలు చేస్తామని.. కోర్టులో పోరాటం చేస్తామన్నారు. ఇప్పటికి తాము సమైక్య రాష్ట్రానికి కట్టుబడి ఉన్నామని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement