సమ్మెను ఉధృతం చేస్తామన్న ఆర్టీసీ కార్మికుల ప్రకటనలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మె పేరుతో బస్టాండ్లు, బస్ డిపోల వద్ద అరాచకం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. గూండాగిరి నడవదని, ఇప్పటి వరకు ప్రభుత్వం కాస్త ఉదాసీనంగా ఉందని, ఇకపై కఠినంగా వ్యవహరిస్తుందని వెల్లడించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో తలెత్తిన పరిస్థితులపై శనివారం ఆయన ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీకి నష్టం చేకూర్చేలా వ్యవహరిస్తున్న కార్మికులను క్షమించే ప్రసక్తే లేదన్నారు. మూడు రోజుల్లోగా వందశాతం బస్సులు నడిపి తీరాల్సిందేనని అధికారులను ఆదేశించారు.