మీటింగ్ జరుగుతుండగా.. ఇంతలో ఆ గదిలోని పైకప్పు నుంచి ఓ ఐదు అడుగుల పైథాన్ కిందపడిపోయింది. ఇద్దరు ఉద్యోగుల మధ్య పైథాన్ పడడంతో.. సిబ్బంది అందరూ భయంతో పరుగులు పెట్టారు. ఈ గందరగోళానికి జడిసిన ఆ పైథాన్ కూడా అక్కడ్నుంచి వెళ్లిపోయింది. ఈ లోపు సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు బ్యాంకు వద్దకు చేరుకుని.. ఆ పైథాన్‌ను పట్టుకొని సమీప అటవీ ప్రాంతంలో వదిలేశారు. అక్కడ ఉన్న సీసీ టీవీలో ఈ దృశ్యాలన్ని రికార్డయ్యాయి.