భూ సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ సూచించినా, బాధిత రైతులు కాళ్లు మొక్కి ప్రాధేయపడినా ఆ తహసీల్దార్ కనికరించలేదు. కొన్ని నెలలుగా బాధిత రైతులను తన కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారు. వారంరోజుల క్రితం రైతులు చేవెళ్ల తహసీల్దార్ పురుషోత్తం కాళ్లు మొక్కుతున్న వీడియో ఆదివారం ఆలస్యంగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. రెవెన్యూ అధికారుల తీరుపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.