జీడిమెట్ల పారిశ్రామికవాడలో ప్రమాదం జరిగింది. జీవిక లైఫ్ సైన్సెస్ కెమికల్ కంపెనీలో రియాక్టర్ పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మృతులను అంబరీష్, అన్వర్ లుగా గుర్తించారు. రియాకర్ట్ పేలుడుతో స్థానికంగా ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం వినిపించింది. పెద్ద ఎత్తున పొగలు కమ్ముకోవడంతోపాటు సంఘటనాస్థలంలో భారీగా మంటలు ఎగిశాయి. పేలుడు శబ్దం విని హడలిపోయిన స్థానికులు కాసేపు ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యారు.
జీడిమెట్ల పారిశ్రామికవాడలో పేలుడు!
Nov 18 2019 6:39 PM | Updated on Nov 18 2019 7:17 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement