చెన్నైలో కుండపోత

భారీ వర్షాలకు చెన్నై తడిసిముద్దయింది. గత ఐదు రోజులుగా చెన్నైతోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. చెన్నై సహా కాంచీపురం, తిరువళ్లూరు, నాగపట్నం, తిరువారూరు, కడలూరు సముద్రతీర జిల్లాల్లో వర్ష బీభత్సంతో ప్రజలు, అధికారులకు కంటిమీద కునుకులేకుండా పోయింది. గురువారం రాత్రంతా కురిసిన వర్షానికి చెన్నై నగరం, శివారు ప్రాంతాల్లో రోడ్లపై ఐదు అడుగుల మేర వరదనీరు ప్రవహిస్తోంది. ఇళ్లల్లోకి నీరు చేరడంతో వేల మందిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. మరో రెండ్రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాలేజీలు, స్కూల్స్‌కు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. శుక్రవారం ఉదయం నుంచి వర్షం కాస్త తెరపిచ్చినప్పటికీ సాయంత్రం నుంచి జోరువాన మొదలైంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top