సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లందించేందుకు కేంద్రం చేపట్టిన ఏఐబీపీ (సత్వర సాగునీటి ప్రయోజన కల్పన పథకం) లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం నీరుగార్చిందని కాగ్ నివేదిక తప్పుబట్టింది. ఆయకట్టుకు వేగంగా నీళ్లందించడాన్ని పక్కనబెట్టి కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చటంపైనే ప్రభుత్వ పెద్దలు ఆసక్తి చూపారని పేర్కొంది. ఏఐబీపీ ప్రాజెక్టుల్లో అక్రమాలపై ‘సాక్షి’ ప్రచురించిన కథనాలు అక్షర సత్యమని తేలుస్తూ కాగ్ నివేదిక ఇచ్చింది.