బావిలో పడ్డ బస్సు.. 7 గురు మృతి

మహారాష్ట్ర నాశిక్‌ జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు ఆటోను ఢీకొన్న అనంతరం రెండు వాహనాలు సమీపంలోని బావిలో పడిపోయాయి. ఈ ఘటనలో 7 మంది మృతిచెందినట్టు అధికారులు తెలిపారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు మాలెగావ్ నుండి కల్వాన్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో ఇరుక్కుపోయినవారిని తాళ్ల సాయంతో బయటకు లాగేందకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎంతమంది గాయపడ్డారనే దానిపై స్పష్టత లేదు. దాదాపు 20 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top