తైవాన్‌లోని నాన్ఫాంగోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం ఓ భారీ వంతెన అకస్మాత్తుగా కుప్పకూలింది. దీంతో దానిపై ప్రయాణిస్తున్న వాహనాలు నదిలో పడ్డాయి. ఈ ఘటనలో 14 మంది గాయపడ్డారు. వాహనాల్లో ఉన్న ప్రయాణికులు నీటిలో పడి గల్లంతయ్యారు. దీంతో పోలీసులు హెలికాప్టర్లు డైవర్ల సాయంతో గాలింపులు జరుపుతున్నారు. అలాగే వంతెన కూలిన సమయంలో దాని కింద చేపలు పడుతున్న బోట్లు ఉన్నాయి. బోట్లపై వంతెన పడిపోవడంతో అవి పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో కొన్నింట్లో పెట్రోల్ ట్యాంకర్లు పేలడంతో మంటలు వ్యాపించాయి. అక్కడున్న సిబ్బంది స్థానికుల సహాయంతో వాటిని అదుపులోకి తీసుకువచ్చారు.
షాకింగ్ వీడియో: కుప్పకూలిన వంతెన
Oct 1 2019 7:06 PM | Updated on Oct 1 2019 7:11 PM
Advertisement
Advertisement
Advertisement
