స్నేహితుడు ఏడుస్తుంటే తట్టుకోలేక..
బాధలో ఉన్న మనిషిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటే వారి వేదన కాస్తైనా తగ్గుతుంది. ‘నీకు నేనున్నా’ అనే భరోసాను ఇచ్చే అటువంటి ఆత్మీయ స్పర్శతో కలిగే ఉపశమనాన్ని మాటల్లో వర్ణించాలనునకుంటే.. ఈ ఫొటోలోని చిన్నారిని చూపిస్తే చాలు. తన స్నేహితుడు ఏడుస్తుంటే తట్టుకోలేక ఓ బాలుడు అతడిని అక్కున చేర్చుకున్నాడు. అతడి ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని ఓదార్చాడు. వీపుపై చేతితో నిమురుతూ అతడిని ఆడించాడు. ఆటిజంతో బాధ పడుతున్న స్నేహితుడిని ఊరడించాడు. అయితే ఇదంతా చేస్తున్న చిన్నారి కూడా డౌన్ సిండ్రోమ్‌తో బాధ పడుతున్నవాడే కావడం విశేషం.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి