ప్రత్యేక హోదాపై తమ పార్టీ స్పష్టత ఉందని వైఎస్సార్‌సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం కూడా హోదాపై జాతీయ పార్టీలు కలిసివస్తే తాము మద్దతుగా వుంటామన్నాప్పుడు హేళన చేసి ఇప్పడు హోదా కోసం మాట్లాడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రత్యేక హోదా కోసం టీడీపీ కలిసి వస్తే మంచిదన్నారు. టీడీపీ-బీజేపీతో మిత్రుత్వం ఉందా, లేదో పవన్ కళ్యాణ్ చెప్పాలని డిమాండ్ చేశారు. ముందస్తు ఎన్నికలు రావని చెప్పడానికి మంత్రి నారాయణ ఎన్నికల కమిషనరా అని మరో ప్రశ్నకు సమధానంగా అన్నారు.