ముంబైలోని ఖర్గర్‌కు చెందిన బీజేపీ కార్పోరేటర్ శత్రుఘన్ కాకడే ఓ హోటల్ యజమానిపై దాడి చేస్తూ కెమెరా కంటికి చిక్కారు. సెక్టర్ 4లో కొత్తగా ప్రారంభించిన షాహీ బావర్చి హోటల్ యజమానిని ప్రతి నెల రూ.50 వేలు కట్టాల్సిందిగా కాకడే అక్రమవసూళ్లకు పాల్పడ్డారు. దీనికి నిరాకరించినందుకు హోటల్ యజమాని ఇంథియాజ్ షేక్(41)పై కాకడే, ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారు. దాడిలో గాయాలైన హోటల్ యజమానిని కమోతేలోని మహాత్మాగాంధీ మిషన్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.