సినిమా స్టంట్‌ సీన్‌ను తలపించేలా..

సినిమా స్టంట్‌ సీన్‌ను తలపించేలాంటి ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ సంఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఆదివారం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన ‘‘ప్రగతి నివేదన సభ’’ సందర్భంగా ట్రాఫిక్‌ రూల్స్‌లో మార్పులు చేశారు. కొన్ని చోట్ల వాహనాల రాకపోకలు ఓకే రహదారిపై జరిగాయి.దీంతో రహదారిపై వెళుతున్న ఓ బైక్‌ ఎదురుగా వస్తున్న మినీ ట్రక్కును ఢీ కొట్టగా.. బైక్‌ నడుపుతున్న వ్యక్తి కొన్ని అడుగులపైకి గాల్లోకి పల్టీలు కొట్టి నేలను తాకాడు. శరీరం రోడ్డును తాకినప్పటికి ఎలాంటి గాయాలు కాకపోవటంతో అతడు వెంటనే లేచి బైక్‌ దగ్గరకు చేరకున్నాడు. రోడ్డుపై వెళుతున్న కొద్దిమంది అతనికి సహాయం చేయటానికి చుట్టూ చేరారు. 

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top