నేటి నుంచి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు

రాష్ట్రంలో పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణలో కీలక ఘట్టానికి సోమవారం అసెంబ్లీ వేదిక కానుంది. రాష్ట్రంలోని 13 జిల్లాలు అభివృద్ధి చెందాల్సిందేనని, ఆ దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కొద్ది రోజులుగా అన్ని ప్రాంతాల్లో ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించడం.. మరో వైపు మూడు గ్రామాల ప్రజలు మాత్రం అన్నీ అమరావతి కేంద్రంగానే ఉండాలని పట్టుపట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర, సమ్మిళిత అభివృద్ధికి బాటలు వేసేందుకు వీలుగా పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మకమైన బిల్లును ప్రతిపాదించనుందని తెలుస్తోంది. ఈ మేరకు నేటి నుంచి ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు మొదలవ్వనున్నాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top