కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ ఫలప్రదం అయింది. మంగళవారం జరిగిన ఈ భేటీలో ఏపీ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సీఎం జగన్, అమిత్ షాతో చర్చించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన మరోసారి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. అలాగే పోలవరం ప్రాజెక్టు పనుల్లో రివర్స్ టెండరింగ్ ప్రక్రియద్వారా రూ. 838 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేశామని అమిత్‌షాకు సీఎం జగన్ తెలిపారు.