ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ఆత్మబలిదానాలు చేసుకోవడం తనను కలచి వేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంబటి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. శనివారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నాలుగేళ్ల పాటు తెలుగుదేశం పార్టీతో అంటకాగిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, ఇప్పుడు బయటకు వచ్చి టీడీపీని వదిలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారని మండిపడ్డారు.