పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మంగళవారం నాలుగేళ్ల వయస్సు కలిగిన బాలుడిని కిడ్నాప్ చేశారు. రూ.5 లక్షలు ఇవ్వాలంటూ తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఓ ఆగంతకుడు బెదిరించాడు. పోలీస్ స్టేషన్‌లో ఉండగానే మరోసారి ఫోన్ కాల్ చేసి స్టేషన్‌కు ఎందుకు వెళ్లావ్ ఫిర్యాదు చేసినా, మీడియాకు చెప్పినా సహించేది లేదంటూ బెదిరించాడు. వివరాల్లోకి వెళితే.. 39వ వార్డు దుర్గాపురం ప్రాంతానికి చెందిన వడ్రంగి పనిచేసుకునే మామిడి లక్ష్మణరావు, దుర్గ దంపతులకు శ్యామ్ గౌతమ్ లేక లేక పుట్టిన సంతానం. మెంటేవారితోటలోని వండర్ కిడ్స్ కిండర్ గార్డెన్ స్కూల్లో ఎల్‌కేజీ చదువుతున్నాడు. సుమారు 11.20 గంటల సమయంలో ఆగంతకుడు స్కూల్ వద్దకు వెళ్లి టీచర్‌తో శ్యామ్ గౌతమ్ కుటుంబ సభ్యులకు యాక్సిడెంట్ అయిందని నమ్మించాడు.
భీమవరంలో బాలుడి కిడ్నాప్
Nov 1 2017 7:03 AM | Updated on Mar 22 2024 11:16 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement