వరుణ్‌, అదితి ఫొటో షూట్‌ డైరీస్‌ | Varun Tej With Aditi Rao Hydari from the sets of their next space | Sakshi
Sakshi News home page

వరుణ్‌, అదితి ఫొటో షూట్‌ డైరీస్‌

Jun 8 2018 11:34 AM | Updated on Mar 21 2024 5:17 PM

వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న మెగా హీరో వరుణ్‌ తేజ్‌, ప్రస్తుతం ఘాజీ ఫేం సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో నటిస్తున్నారు. స్పేస్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. వరుణ్ తేజ్‌ వ్యోమగామిగా నటిస్తున్న ఈ సినిమాలో అదితిరావ్‌ హైదరీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

తాజాగా షూటింగ్ సమయంలో వరుణ్ తేజ్‌తో కలిసి దిగిన ఫొటోను షూట్‌ డైరీస్‌ అంటూ తన సోషల్‌ మీడియా పేజ్‌లో షేర్‌ చేశారు అదితి. ఘాజీ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సంకల్ప్‌ రెడ్డి హాలీవుడ్ మూవీ జీరో గ్రావిటీ ఇన్సిపిరేషన్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారన్న టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమాకు అంతరిక్షం అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement