ప్రియాంక చోప్రా ఎంగేజ్‌మెంట్ జరిగిపోయాందా?

బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా, అమెరికన్‌ సింగర్‌ నిక్‌ జోనస్‌ల ప్రేమాయణం త్వరలో పెళ్లి పీటలెక్కబోతుంది. వీరిద్దరి నిశ్చితార్థం అయిపోయినట్టు అమెరికన్‌ మీడియా ధృవీకరించింది. గత వారం ప్రియాంక చోప్రా పుట్టిన రోజు నాడు, నిక్‌ జోనస్‌తో ఆమె నిశ్చితార్థం జరిగినట్టు అమెరికన్‌ మీడియా చెబుతోంది. వెరీ స్పెషల్‌ కారణంతో, ప్రియాంక, భరత్‌ అనే చిత్రం నుంచి తప్పుకున్నారని..  నిక్‌, ప్రియాంకల పేరును పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆ సినిమా డైరెక్టర్‌ అలీ అబ్బాస్‌ జఫర్‌ ట్వీట్‌ చేయడంతో, వీరి వివాహంపై ఈ డైరెక్టర్‌ కూడా పెద్ద హింటే ఇచ్చాడని బాలీవుడ్‌ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. 

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top