విరాట్ కోహ్లి సేన ఈ ఏడాదిని మరో గొప్ప విజయంతో ముగించింది. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా అసమాన ఆటను ప్రదర్శించింది. సిరీస్‌ను 4–0తో సొంతం చేసుకుంది. మంగళవారం ముగిసిన చివరిదైన ఐదో టెస్టులో భారత్ ఇన్నింగ్స్, 75 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ఇంగ్లండ్‌పై భారత జట్టు ఓ సిరీస్‌ను 4–0తో నెగ్గడం ఇదే ప్రథమం