:భారత్ తో చివరి టెస్టు ఆఖరి రోజు ఆటలో లంచ్ సమయానికి ఇంగ్లండ్ స్కోరు 97/0. దాంతో మ్యాచ్ డ్రాగానే ముగుస్తుందని అంతా భావించారు. ఆ తరువాతే అసలు కథ మొదలైంది. లంచ్ తరువాత రెండో సెషన్లో నాలుగు వికెట్లు సాధించి ఆధిక్యంలో నిలిచిన విరాట్ సేన.. మూడో సెషన్లో ఇంగ్లండ్ భరతం పట్టింది. ఇంకా ఈ రోజు ఆటలో 7.0 ఓవర్లు ఉండగానే భారత్ సంచలనం విజయం సాధించింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా విజృంభించి ఏడు వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించగా, మిగతా పనిని ఇషాంత్ శర్మ, అమిత్ మిశ్రా, ఉమేశ్ యాదవ్లు పూర్తి చేశారు. దాంతో ఇన్నింగ్స్ 75 పరుగుల తేడాతో భారత్ విజయం దక్కింది. తద్వారా సిరీస్ను భారత్ 4-0 గెలుచుకుని తమ తిరుగులేదని నిరూపించింది.