ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు, ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను తాను చాలా తేలికగా పెవిలియన్ బాట పట్టించగలనని టీమిండియా బౌలర్ కుల్దీప్ యాదవ్ అన్నారు. తన బౌలింగ్‌ను ఎదుర్కొన్నప్పుడు వార్నర్ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నందున అలాంటి బ్యాట్స్‌మెన్‌ను ఈజీగా ఔట్ చేయవచ్చునని తెలిపారు.