ఢిల్లీ వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఏం అడిగారని వైఎస్ఆర్ సీపీ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. రాష్ట్రంలోని కీలక సమస్యలపై కేంద్రంతో చర్చించారా, ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తారా అని నిలదీశారు. చంద్రబాబు నాయుడు ఒకమాట, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మరో మాట చెబుతున్నారని విమర్శించారు.