బాబు వస్తే జాబ్ వస్తుందని ఎన్నికల సందర్భంగా ఊదరగొట్టిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి విద్యార్థులకు చేసిందేమీ లేదని బీటెక్ విద్యార్థిని శ్రావణి ఆవేదన వ్యక్తం చేసింది. వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన యువభేరి కార్యక్రమంలో ఆమె మంగళవారమిక్కడ మాట్లాడుతూ ‘ముఖ్యమంత్రి అయ్యాక పెట్టుబడులు తెస్తామంటూ చంద్రబాబు ఫారిన్ టూర్ వెళ్లి వచ్చారు కదా. విదేశీ పర్యటనల తర్వాత రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వచ్చాయి. కరువు ప్రాంతమైన రాయలసీమకు ఎన్ని పరిశ్రమలు వచ్చాయని’ ఆమె అడిగిన ప్రశ్నకు వైఎస్ జగన్ సమాధానం ఇస్తూ... చిత్తశుద్ధి ఉంటే హోదా కోసం చంద్రబాబు కేంద్రంతో పోరాటం చేసేవారన్నారు.