రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ పార్లమెంటు సభ్యులతో రాజీనామాలు చేరుుస్తామని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ‘పార్లమెంటు శీతాకాల, బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంట్‌ను స్తంభింపజేస్తాం. అప్పటికీ ప్రత్యేక హోదాపై స్పష్టమైన ప్రకటన రాకపోతే బడ్జెట్ సమావేశాల తర్వాత వచ్చే సమావేశాల నాటికి ఎంపీల చేత రాజీనామాలు చేయిస్తాం. ప్రత్యేక హోదా ఎజెండాతోనే ఉప ఎన్నికలకు వెళతాం’ అని జగన్ స్పష్టం చేశారు