‘‘రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా పోయిందని రాహుల్‌గాంధీ అన్నారట. వారు పెద్దోళ్లు... అవసరంకోసం ఏమైనా మాట్లాడతారు. అవసరం వస్తే దండ వేస్తారు. లేదంటే బండ వేస్తారు. కానీ ఏడాదిగా ప్రభుత్వంపై పోరాటాలు చేస్తూనే ఉన్నాం. గుంటూరు, మంగళగిరితోపాటు చాలాచోట్ల దీక్షలు చేశాం. మేం చేసిన రైతు భరోసాయాత్రతోనే అనంతపురం జిల్లాలో రైతుల ఆత్మహత్యలు ఢిల్లీకి తెలిశాయి. అందుకే విమానం ఎక్కి ఢిల్లీ నుంచి జిల్లాకు వచ్చారు’’ అని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీపై వైఎస్సార్‌సీపీ అధినేత, విపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. రైతుభరోసాయాత్ర నాలుగోరోజు శుక్రవారం జగన్ పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలంలో పర్యటించి, ఐదు కుటుంబాలను ఓదార్చారు. రొద్దం మండల కేంద్రంలో రైతులు, డ్వాక్రా మహిళలతో చర్చాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. తెలుగుదేశం ప్రభుత్వం రుణమాఫీ చేయకుండా మోసం చేయడంతో రాష్ట్రంలో రైతులు పిట్టల్లా రాలిపోతున్నారు. అనంతపురం జిల్లాలో 80 మందికిపైగా అన్నదాతలు, 20మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి కుటుంబాలకు ధైర్యం చెప్పాలని గత నాలుగు నెలల్లో 23 రోజులపాటు భార్య, పిల్లలను వదిలి రైతు భరోసాయాత్ర చేస్తున్నా. రెండు విడతల్లో 25 కుటుంబాలను పరామర్శించా. మూడో విడత సాగుతోంది. రైతులు, చేనేతలు ఎలాంటి దుర్భర పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుంటున్నారో ప్రభుత్వాలకు చూపించేలా తిరుగుతున్నా. ఈ యాత్రతోనే‘అనంత’ ఆత్మహత్యలు దేశానికి తెలిశాయి. అనంతపురం అనే ఓ జిల్లా ఉందని రాహుల్‌గాంధీకి జ్ఞానోదయమైంది.
Jul 25 2015 7:55 AM | Updated on Mar 21 2024 7:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement