ఖమ్మం జిల్లా ఇల్లందులో దారుణం జరిగింది. ఓ యువకుడు ఓ యువతిని లారీ కిందకు తోసివేశాడు. లారీ డ్రైవర్ అప్రమత్తమై బ్రేక్ వేయడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. స్థానికుల సమాచారం మేరకు శేఖర్, సంధ్యలకు కాలేజీలో పరిచయముంది. ఇల్లందులో రోడ్డుపై వీరిద్దరూ నడిచి వెళుతుండగా.. ఓ విషయంపై వాగ్వాదం జరగడంతో శేఖర్ హఠాత్తుగా సంధ్యను పక్కగా వస్తున్న లారీ కిందకు తోసివేశాడు. ఈ విషయాన్ని గమనించి వెంటనే బ్రేక్ వేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని లారీ డ్రైవర్ చెప్పాడు. అంతకుముందు ఇద్దరి మధ్య వాదులాట జరిగినట్టు తాను చూశానని తెలిపాడు. నిందితుడు వెంటనే అక్కడ నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన సంధ్యను ఆస్పత్రికి తరలించారు. విద్యార్థుల ద్వారా సమాచారం అందుకున్న బాధితురాలి తల్లిదండ్రులు, పోలీసులు ఆస్పత్రికి వచ్చారు. యువతి అపస్మారక స్థితిలో ఉండటంతో పూర్తి వివరాలు తెలియరాలేదు. యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదిలావుండగా ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని సమాచారం.
Sep 4 2015 4:12 PM | Updated on Mar 21 2024 7:50 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement